Valmiki Ramayanam - Charitraka Drukonam

Valmiki Ramayanam - Charitraka Drukonam

TeluguEbook
DamodaraReddy, Pamireddy
Distributed By Ingram Spark
EAN: 9788196087678
Available online
CZK 185
Common price CZK 205
Discount 10%
pc

Available formats

Detailed information

వాల్మీకి రామాయణం - చారిత్రక దృక్కోణం అనే అంశంపై పరిశోధన చేయడానికి 2004 వ సంవత్సరం లోనే బీజం పడింది. చరిత్ర - చారిత్రక రచనల పట్ల నాకున్న ఆసక్తి తో రెండు చారిత్రక రచనలు చేశాను. ఈ పరంపర తోనే రామాయణంపై దృష్టి పెట్టాను. రాళ్ళపై రాతలు కన్పించవు కాని శిలలపై రామకథా శిల్పాలు అనేకం కన్పిస్తాయి. తవ్వకాలలో రామాయణం కాలం నాటి మట్టి పాత్రలు లభించలేదు కాని ప్రతి భారతీయుని గుండెలు తవ్వితే రాముడే కన్పిస్తాడు. అక్కడక్కడ రాజులు వేయించిన రామటెంకెలు (నాణ్యాలు) రామచరిత్రకు ఆధారాలుగా నిలవక పోయినా, భారతీయ సమాజంలో అనాదిగా రామకథా సంబంధిత నామాలు (పేర్లు) అంతటా కన్పిస్తాయి.ఈ కోణంలోనే రాముడి చారిత్రకతను నిరూపించే ప్రయత్నం చేశాను. ఎన్నో అంశాలు నేటికీ చిక్కు వీడని ప్రశ్న. పురావస్తు శాఖ నిరూపించనూలేదు. పాశ్చాత్య దృక్పథంతో రాయబడ్డ భారత చరిత్రను విస్మరించి స్వచ్ఛమైన భారతీయ చారిత్రక తత్వాన్ని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేళ రామాయణం జరిగి ఉన్నా, అది అంతా ప్రాచీనమైంది కాదు. అది లోహయుగం తరువాత జరిగింది. ఇందులో లోహపు ఆయుధాలు, పార లాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇనుప యుగం తరువాతే జరిగింది. బంగారు, వెండి గురించి తెలిసిన సింధు నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదని వాదించే వాళ్లు ఉన్నారు.ఇక్కడ మతాల గురించి, మతశక్తుల గురించి చర్చించడం లేదు. భారతీయ ప్రాచీనతను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా భారతీయ జాతి మానసిక బలాన్ని, విశ్వాసాన్ని పొందగలుగుతుంది. రామాయణ విశిష్టతో పాటు రాజకీయ, సామాజిక, భౌగోళిక అంశాల్ని పాఠకుల ముందుకు తేవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ పడిన అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.- డాక్టర్. పామిరెడ్డి దామోదరరెడ్డి 



EAN 9788196087678
ISBN 8196087675
Binding Ebook
Publisher Distributed By Ingram Spark
Publication date March 1, 2023
Pages 143
Language Telugu
Country Uruguay
Authors DamodaraReddy, Pamireddy
Manufacturer information
The manufacturer's contact information is currently not available online, we are working intensively on the axle. If you need information, write us on helpdesk@megabooks.sk, we will be happy to provide it.